ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Elections: ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ.. కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 23 , 2025 | 03:39 PM

MLC Elections: మరికొద్ది రోజుల్లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్... ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

MLC Candidate Alapati Raja

గుంటూరు, ఫిబ్రవరి 24: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు తనకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆదివారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కృష్ణా - గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ.. విద్యా వ్యాప్తి కోసం ఎటువంటి అదనపు పనులు లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి డీఎస్సీ ప్రకటించారని గుర్తు చేశారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ స్కూల్‌లో ఖాళీలు ఉన్నాయో.. వాటి ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయ లేదని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వంతో ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడకుండా లాలూచీ పడ్డారని ఆరోపించారు.


శాసనమండలిలో అమరావతి రాజధాని బిల్లు పెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు లేవ లేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మద్యం దుఖాణాల ముందు ఉపాధ్యాయులను కాపలా ఉంచారని విమర్వించారు. ప్రభుత్వం వద్ద మీకు గౌరవం దక్కక పోతే మీ తరుపున తాను పోరాడతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఉపాధ్యాయులు తనకు మద్దతు తెలుపుతోన్నందకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పోరాడే వారిని గెలిపించాలంటూ ఉపాధ్యాయులకు సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఫిబ్రవరి 28న జరగనున్నాయి. వీటి ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్న ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 23 , 2025 | 03:39 PM