ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rathotsavam: ఘనంగా.. గౌరీ శంకరుల రథోత్సవం

ABN, Publish Date - Feb 28 , 2025 | 05:15 AM

ముక్కంటి ఆలయంలోని అలంకార మండపంలో సర్వాలంకార భూషితులైన శంకరుడు, ఆయన దేవేరి గౌరీదేవి మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య తేరు వీధిలోని రథాల వద్దకు వేంచేశారు.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి క్షేత్రంలో గౌరీ శంకరుల రథోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ముక్కంటి ఆలయంలోని అలంకార మండపంలో సర్వాలంకార భూషితులైన శంకరుడు, ఆయన దేవేరి గౌరీదేవి మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య తేరు వీధిలోని రథాల వద్దకు వేంచేశారు. తేరువీధిలోని ఆలయ మండపంలో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పరమశివుడిని పెద్ద రథంపై, ఉమాదేవిని చిన్న రథంపై అధిష్ఠింపచేశారు. పూజల అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. చతుర్మాడ వీధుల్లో స్వామిఅమ్మవార్ల రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు. ఇక రాత్రి నారద పుష్కరిణిలో తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెప్పలపై ఊరేగుతున్న జ్ఞానప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు వందలాదిమంది భక్తులు తరలివచ్చారు. వేకువ జామున ముక్కంటి ఆలయంలో లింగోద్భవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 05:15 AM