Gade Srinivasulu Naidu: కూటమి అభ్యర్థిగానే పోటీచేశా
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:39 AM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర సంఘాల తరఫున కూటమి అభ్యర్థిగానే తాను పోటీ చేశానని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ గాదె స్పష్టీకరణ
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర సంఘాల తరఫున కూటమి అభ్యర్థిగానే తాను పోటీ చేశానని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా పనిచేస్తానని తెలిపారు.
Updated Date - Mar 06 , 2025 | 06:39 AM