Pendurthi: పెందుర్తి నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థులకు అస్వస్థత..
ABN, Publish Date - Feb 19 , 2025 | 08:07 PM
పెందుర్తిలోని నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కావడంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, నలుగురు కోలుకున్నారు. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది.
పెందుర్తి (Pendurthi) లోని నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) కావడంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, నలుగురు కోలుకున్నారు. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. పెందుర్తి వేలంపేట లో ఉన్న ఇందిర నర్సింగ్ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై అధికారులు పూర్తి విచారణ జరుపుతున్నారు (Pendurthi nursing college hostel).
ఇందిర నర్సింగ్ హాస్టల్ విద్యార్థులు మంగళవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో వారు భోజనం చేసిన తర్వాత ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి పార్టీ లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఐదుగురు విద్యార్థినులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన వెన్నెల, దివ్య, లలిత కుమారి, సంధ్య ఆరోగ్యం నిలకడగా ఉండగా మాధవి పరిస్థితి మాత్రం విషమంగా మారింది.
దీంతో అధికారులు మాధవిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో వేరే హాస్పిటల్ కి తరలించారు. ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్ పరిసర ప్రాంతాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడం, అలాంటి అపరిశుభ్ర వాతావరణంలోనే హాస్టల్ క్యాంటిన్ కూడా ఉండడం ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు అదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 19 , 2025 | 08:07 PM