RepublicDay Parade: ప్రధాని మోదీకి కూడా మన శకటం బాగా నచ్చింది: ఏపీ సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 26 , 2025 | 07:22 PM
దేశ రాజధాని ఢిల్లీలోరి కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల శకటలను ప్రదర్శించారు. వాటిల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ కర్రతో ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేసే బొమ్మలు దేశవిదేశాల్లో ఆదరణను చూరగొన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల శకటలను ప్రదర్శించారు. వాటిల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం (Etikoppaka Bommala Bazaar ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ కర్రతో ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేసే బొమ్మలు దేశవిదేశాల్లో ఆదరణను చూరగొన్నాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రధాని మోదీని సైతం మురిపించాయి (RepublicDay Parade).
ఏటికొప్పాక శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రధాని మోదీ (PM Modi)ని సైతం ఆకట్టుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) సంతోషం వ్యక్తి చేశారు. ఆ శకటం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ``76వ గణతంత్ర వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులందరిని ఆకట్టుకుంది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ``బొమ్మలమ్మ.. బొమ్మలు`` అంటూ సాగే పాటతో ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో సాగిన శకటాల పరంపరలో ప్రత్యేక ఆకర్షణగా మన ఏటికొప్పాక బొమ్మల కొలువు నిలిచింది. దీనికి కారణభూతులైన వారందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను`` అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Updated Date - Jan 26 , 2025 | 07:23 PM