Pawan Meets Chandrababu: బాబుతో పవన్ భేటీ.. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ..
ABN, Publish Date - Mar 03 , 2025 | 06:59 PM
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించినట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చించారు. అలాగే, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపైన ఇద్దరి నేతల మధ్య చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైనా సమావేశంలో చర్చించారని సమాచారం. అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్‌లో దాదాపు గంటపాటు ఇరువురి నేతల భేటీ జరిగింది.
కాగా, రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 11న నామినేషన్ల పరిశీలనకు, 13న నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈవో వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Also Read:
ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ ప్రకటన
ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్
Updated Date - Mar 03 , 2025 | 07:49 PM