ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coalition government: పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ

ABN, Publish Date - Feb 21 , 2025 | 05:23 AM

గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ అవుతుండడంతో పల్లెల్లో పనులు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు నేరుగా బదిలీ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో పల్లె పనులకు నిధుల కొరత తీరుతోంది.

కూటమి హయాంలో అందుతున్న నిధులు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది. జగన్‌ పాలనలో నిధుల్లేక నీరసించిన గ్రామ పంచాయతీలు కోలుకుంటున్నాయి. గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ అవుతుండడంతో పల్లెల్లో పనులు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు నేరుగా బదిలీ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో పల్లె పనులకు నిధుల కొరత తీరుతోంది.

వడివడిగా సాగుతున్న అభివృద్ధి పనులు

జగన్‌ పాలనలో పల్లెల సొమ్ము విద్యుత్‌కు

ఇష్టానుసారంగా పల్లె నిధుల దారి మళ్లింపు

ఆర్థిక సంఘం ఇచ్చే సొమ్ములూ ఉచితాలకు

తాము అధికారంలోకి వస్తే.. పల్లె నిధులు

నేరుగా పంచాయతీలకు ఇస్తామన్న కూటమి

పగ్గాలు చేపట్టాక.. సర్పంచ్‌ల ఖాతాలకు జమ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ పాలనలో కళ తప్పిన పంచాయతీలు.. కూటమి హయాంలో గాడిన పడుతున్నాయి. పంచాయతీలకు దక్కే నిధులను గత ప్రభుత్వం దారి మళ్లిస్తే.. ప్రస్తుత సర్కారు మాత్రం ప్రతి రూపాయినీ పంచాయతీలకే అప్పగిస్తోంది. ఫలితంగా పంచాయతీల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. గత జగన్‌ ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగపరంగా దక్కుతున్న కేంద్రం నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో గ్రామాల్లో తాగునీటి మోటార్లను సైతం మరమ్మతు చేసుకోలేని దుస్థితిలో పంచాయతీలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సీఎం చంద్రబాబు ఆదేశాలు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణాలతో పాటు 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం పనులు జరుగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 8 నెలల్లో 33,365 పనులు పనులు చేపట్టారు. పంచాయతిరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ 15వ ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు పదే పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సైతం ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రి, కేంద్ర ఆర్థికమంత్రితో నిధుల విషయంపై వినతిపత్రాలు అందించారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో వైపు ఉపముఖ్యమంత్రి పదే పదే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టడంతో కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నాయి. ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వం అప్రతిష్ట తీసుకురావడంతో దానిని సరిచేసి మళ్లీ కేంద్ర అధికారుల దృష్టి మన వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది.


వైసీపీ హయాంలో.. నిధులు డిస్కంకు

జగన్‌ హయాంలో పంచాయతీల నిధులను ప్రభుత్వం పంచాయతీల అనుమతి లేకుండానే లాగేసుకుంది. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 2022-23 సంవత్సరం వరకు రూ.2,165 కోట్లు డిస్కంకు చెల్లించేలా దారి మళ్లించారు. వీటితో పాటు ఎల్‌ఈడీ వీధిలైట్ల కోసం ఈఈఎ్‌సఎల్‌ సంస్థ కోసం మరో రూ.100 కోట్లు పంచాయతీ ఖాతాల్లో నుంచి చెల్లించారు. సర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించడంతో అప్పట్లో వారు ధర్నాలు, నిరసనలకు దిగారు. అయినప్పటికీ జగన్‌ సర్కార్‌ ఖాతరు చేయలేదు. నిరసనలు చేపట్టిన సర్పంచ్‌లను పోలీసులతో కట్టడి చేశారు. దీంతో వైసీపీ చెందిన సర్పంచ్‌లే ఆ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. వైసీపీ సర్కార్‌ పంచాయతీ నిధులు దారిమళ్లిస్తోందని కేంద్రానికి సర్పంచ్‌లు ఫిర్యాదులు చేయడంతో 2022-23 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు జమ చేయాలని కేంద్రం నిబంధనలు పెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.998.64 కోట్లు 2024 మార్చిలో విడుదల చేస్తే ఆ నిధులను అప్పటి వైసీపీ ప్రభుత్వం 45 రోజులపాటు అంటే మే 30 దాకా విడుదల చేయలేదు. చివరకు కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఆగస్టు 21న పంచాయతీరాజ్‌ సంస్థలకు నిధులు విడుదల చేయడంతో సర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు.


సజావుగా నిధుల విడుదల

కూటమి ప్రభుత్వం వచ్చాక 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల సజావుగా సాగుతోంది. 2024-25కి సంబంధించి రెండు విడతల్లో రూ.2,109 కోట్లు విడుదలయ్యాయి. ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తామన్న హామీని కూటమి కచ్చితంగా అమలు చేస్తోంది.

సర్పంచ్‌ల విన్నపాలు..

గతంలో మాదిరిగా డిస్కంలకు విచ్చలవిడిగా విద్యుత్‌ చార్జీలు చెల్లించే విధానానికి స్వస్తి పలకాలని సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తాము వాడని విద్యుత్‌కు పంచాయతీల నుంచి నిధుల వసూలుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయాల్లేని గ్రామ పంచాయతీలకు రూ.లక్షలు విద్యుత్‌ చార్జీలు వసూలు చేయడంతో వందల సంఖ్యలో మైనర్‌ గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులన్నీ డిస్కంలకు చెల్లించారని, దీంతో చేతిలో నిధులు లేకుండా పోయాయని సర్పంచ్‌లు చెబుతున్నారు.

డిస్కంలకు పంచాయతీల నుంచి నేరుగా నిధులు మినహాయించుకునేందుకు అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆర్థికశాఖను కోరుతున్నారు.

పంచాయతీరాజ్‌ కమిషనర్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవ తీసుకుని ఇక నుంచి డిస్కంలకు గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపును నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 05:23 AM