Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
ABN , Publish Date - Feb 20 , 2025 | 07:35 PM
ఢిల్లీలో ఈరోజు 27 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి.. బీజేపీ హామీల గురించి ప్రస్తావించారు. ప్రధానంగా మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే పథకాన్ని ఆమోదించాలన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతోపాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి తెచ్చింది. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీని బీజేపీ ఇప్పుడు నెరవేర్చాలని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) అన్నారు. గురువారం మొదటి మంత్రివర్గ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే పథకాన్ని ఆమోదించాలని కోరారు.
అంతేకాదు మార్చి 8 నాటికి బీజేపీ ప్రభుత్వం తమ ఖాతాల్లోకి రూ. 2500 జమ చేస్తుందని ఢిల్లీ మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రితో సహా అందరు బీజేపీ నేతలు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మొదటి మంత్రివర్గంలో మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మహిళలందరూ తమ ఫోన్‌లను తమ బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోవాలని, తద్వారా మార్చి 8న వారి ఖాతాలో రూ. 2500 జమ అయ్యిందని మెసేజ్ వస్తుందని ప్రధానమంత్రి ఓ ర్యాలీలో చెప్పారని అతిషి గుర్తు చేశారు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందని, రేఖ గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారని అతిషి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వ మొదటి మంత్రివర్గ సమావేశం ఈరోజు రాత్రి 7 గంటలకు జరుగుతుంది. కాబట్టి నేడు రేఖ గుప్తా, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తామని బీజేపీ చేసిన వాగ్దానాన్ని క్యాబినెట్ సమావేశంలో ఆమోదించాలన్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి కొత్తగా నియమితులైన ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఆమె మొత్తం మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేసినందున అభినందించారు. ప్రస్తుతం ఢిల్లీకి నాల్గో మహిళా ముఖ్యమంత్రి వచ్చారని ఆమె అన్నారు. ఇది ఢిల్లీ మహిళలకు సంతోషకరమైన విషయమని, ఒక మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఢిల్లీ మహిళలకు బీజేపీ ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News