ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Innovation Hub : మాతో కలిసి రండి

ABN, Publish Date - Jan 23 , 2025 | 03:44 AM

ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని ప్రపంచ ఐటీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌, డయాగ్నస్టిక్స్‌ను

బిల్‌గేట్స్‌కు బాబు ఆహ్వానం

ఆరోగ్యం, విద్య ఆవిష్కరణలకు ప్రాధాన్యం

ఏఐ వర్సిటీ సలహా మండలిలో చేరండి

గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యం కోసం

ఆంధ్రప్రదేశ్‌ ఎదురు చూస్తోంది

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ హెల్త్‌

ఇన్నోవేషన్‌ డయాగ్నస్టిక్స్‌ పెట్టండి

మైక్రోసాఫ్ట్‌ అధినేతను కోరిన సీఎం

ఐటీ అభివృద్ధికి సహకరించండి

గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలకు

ఏపీని గేట్‌వేగా నిలపండి

బిల్‌గేట్స్‌తో భేటీలో మంత్రి లోకేశ్‌

చాలాకాలం తర్వాత చంద్రబాబును

కలవడం ఆనందంగా ఉందన్న గేట్స్‌

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని ప్రపంచ ఐటీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌, డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. దావో్‌సలో బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. బుధవారం దావోస్‌ ప్రొమెనేడ్‌ మైక్రోసాఫ్ట్‌ కేఫ్‌లో ఈ భేటీ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్‌ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్‌గేట్స్‌కు చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న కృత్రిమమేథ యూనివర్సిటీ సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని గేట్స్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. అంతర్జాతీయ ఆవిష్కరణలను స్థానికంగా వినియోగించుకునేలా బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు దక్షిణాది రాష్ట్రాలకు ఏపీని ముఖద్వారంగా చేసుకునేందుకు పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో బిల్‌ మిలిందా గేట్స్‌ భాగస్వామ్యం కోసం ఏపీ ఎదురు చూస్తోందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని మంత్రి లోకేశ్‌ బిల్‌గేట్స్‌ను కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం కావాలని గేట్స్‌ను ఆహ్వానించారు. ఆఫ్రికాలో హెల్త్‌ డ్యాష్‌ బోర్డుల తరహాలో ఏపీలోనూ ఇన్నోవేషన్‌ ఇంక్యుబేషన్‌ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున నైపుణ్య సహకారాన్ని అందించాలని కోరారు. ఫౌండేషన్‌ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా చేసుకోవాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ భేటీపై బిల్‌గేట్స్‌ స్పందిస్తూ.. విజనరీ లీడర్‌ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ నుంచి సానుకూల స్పందన ఉంటుందని హామీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత బిల్‌గేట్స్‌ను కలవడం తనకూ ఆనందంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

యూనీలీవర్‌ చీఫ్‌తో బాబు భేటీ

ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువులు విక్రయించే యూనీలీవర్‌ చీఫ్‌ సప్లయ్‌ చైన్‌ ఆఫీసర్‌ విల్లెం ఉజ్జెన్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో హిందూస్థాన్‌ లీవర్‌ రూ.330 కోట్లతో పామాయిల్‌ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతోపాటు బ్యూటీ పోర్టు ఫోలియేకు సంబంధించి టెక్నాలజీ సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బ్యూటీ, హోంకేర్‌ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఉజ్జెన్‌ను ఆహ్వానించారు.


సెన్మట్‌ సీఈవోతోనూ...

ప్రపంచ ఆర్థిక సదస్సు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు, సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ అండ్‌ మెటీరియల్స్‌(సెన్మట్‌) హెడ్‌ రాబర్టో బోకాను సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, బ్యాటరీ స్టోరేజీ, సోలార్‌ ప్యానల్స్‌ ఉత్పత్తి రంగాల్లో ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్‌ సహకారం అందించాలని కోరారు. క్లీన్‌ ఎనర్జీ నాలెడ్జ్‌-స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్‌ మద్దతు ఇవ్వాలని కోరారు.

సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టండి

3 నుంచి 5 వేల ఎకరాలు సమకూరుస్తాం.. ఎయిరిండియా ఎండీ, సీఈవోతో లోకేశ్‌

‘ఏపీ రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టండి. దుబాయ్‌ విమానాశ్రయాన్ని తలదన్నేలా ఉండాలి. మీకు 3 వేల నుంచి 5 వేల ఎకరాలను సమకూరుస్తాం’ అని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఎయిరిండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో క్యాంప్‌ బెల్‌ విల్సన్‌ను కోరారు. దావో్‌సలో ఆయన విల్సన్‌తో భేటీ అయ్యారు. విశాఖ విమానాశ్రయంలో ప్రాంతీయ మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవర్‌హాల్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సీఆర్డీయే పరిధిలో దుబాయ్‌ తరహా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయన్నారు. పైలెట్లు, విమానయాన సాంకేతిక సిబ్బంది కోసం శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విల్సన్‌ స్పందిస్తూ.. విశాఖలో ఎంఆర్‌వో హబ్‌ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తామని, సీఆర్డీయే పరిధిలో విమానాశ్రయం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తామన్నారు.

విశాఖలో డిజైన్‌ కేంద్రం పెట్టండి

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు,సాంకేతికంగా తమ రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలంటూ దావోస్‌ వేదికగా ప్రతిష్ఠాత్మక కంపెనీలను సీఎం చంద్రబాబు కోరారు. సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్‌ క్లౌడ్‌ సంస్థ తన డిజైన్‌ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటుచేసే విషయం యోచించాలని ఆ సంస్థ సీఈవో థామస్‌ కురియన్‌కు సూచించారు. క్లౌడ్‌ ప్రొవైడర్‌లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థ ఇది. ఢిల్లీ, ముంబైల్లో 2కేంద్రాలను ఇప్పటికే నెలకొల్పింది. విశాఖలో డేటాసిటీ ఏర్పాటుకు; ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడానికి ప్రభుత్వంతో గూగుల్‌ ఇప్పటికే పలు ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఈవో కురియన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉందని ఆయనకు చంద్రబాబు చెప్పారు. డిజైన్‌ కేంద్రానికి విశాఖ అత్యంత సానుకూలమైనదని చెప్పారు.

పెట్రోనా్‌సకు మూలపేట అనుకూలం

మలేసియాకు చెందిన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ పెట్రోనాస్‌ సీఈవో , ప్రెసిడెంట్‌ మహహ్మద్‌ తౌఫిక్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెట్రోనాస్‌ కంపెనీ నేచురల్‌ గ్యాస్‌, గ్రీన్‌ మాలిక్యూలస్‌ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. సముద్రతీర ప్రాంతం అత్యధికంగా కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోనాస్‌ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని తౌఫిక్‌ను చంద్రబాబు కోరారు. ఇందుకు కొత్తగా ఓడరేవును నిర్మిస్తున్న మూలపేట అనువుగా ఉంటుందని సూచించారు. 2030 నాటికల్లా ఏడాదికి ఐదు మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని పెట్రోనాస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కాకినాడ ప్లాంటులో రూ.13వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. పెట్రోకెమికల్‌ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోను, గ్లోబల్‌ ఫెసిలిటీ సెంటరులోను పెట్టుబడులు పెట్టాలని తౌఫిక్‌ను చంద్రబాబు కోరారు.


స్మార్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మించండి

రాష్ట్రంలో స్మార్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ను నిర్మించాలని దిగ్గజ కంపెనీ డీపీ వరల్డ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. దావోస్‌ సదస్సులో ఆ సంస్థ సెంట్రల్‌ ఆసియా, ఆఫ్రికా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిజ్వాస్‌ సూమూర్‌తో ఆయన చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్‌కు ఐదు కంటైనర్‌ టెర్మినల్స్‌ ఉన్నప్పటికీ, ఏపీలో ఇప్పటిదాకా ఒక్క కంటైనర్‌ కూడా లేదని చంద్రబాబు గుర్తు చేశారు. కాకినాడ, మూలపేట, కృష్ణపట్నంలో స్మార్ట్‌ కంటైనర్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని సూమూర్‌కు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీపోర్టులోను, ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌లోను పెట్టుబడులు పెట్టాలని కోరారు. డీపీ వరల్డ్‌ ప్రపంచవ్యాప్తంగా 82 మెరైన్‌, ఇన్‌ల్యాండ్‌ టెర్మినళ్లను నిర్వహిస్తోంది. గ్లోబల్‌ కంటైనర్‌ వ్యాపారంలో దాదాపు పది శాతం మార్కెట్‌ డీపీ వరల్డ్‌ సొంతం. రాష్ట్రానికి ఈ సంస్థ వస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

డిజిటల్‌ హబ్‌ ఏర్పాటు చేయండి

పెప్సికో ఇంటర్నేషనల్‌ బేవరేజస్‌ సీఈవో యూజీన్‌ విల్లెంసెన్‌, పెప్సికో ఫౌండేషన్‌ చైర్మన్‌ స్టీవెన్‌ కెహోతోలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రపంచంలోనే రెండో పెద్ద బేవరేజెస్‌ సంస్థ పెప్సికో ఇప్పటికే శ్రీసిటీలో బాట్లింగ్‌ ప్లాంట్‌ నిర్వహిస్తోంది. విశాఖపట్నాన్ని గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌గా చేసుకుని అక్కడ పెప్సికో డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేయవచ్చని చంద్రబాబు సూచించారు. గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీస్‌ సెంటర్‌ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్కురే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌తోపాటు, సప్లై చైన్‌ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్‌ఎ్‌ఫతో భాగస్వామి కావాలని సూచించారు. బహ్రెయిన్‌ ప్రధాని కార్యాలయ ప్రతినిధి హమద్‌ అల్‌ మహ్మద్‌ ముంరాలకత్‌, సీఈవో అబ్దుల్లా బిన్‌ ఖలీఫాతోనూ చర్చలు జరిపారు. పారిశ్రామిక పాలసీలను వివరించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం ఏపీకి రావాలని ఆహ్వానించారు.

Updated Date - Jan 23 , 2025 | 03:44 AM