AP High Court : డాక్యుమెంట్లపై నిర్ణయానికి నిర్ధిష్ట గడువు ఉందా?
ABN, Publish Date - Feb 20 , 2025 | 06:13 AM
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు నోటీసులు
ABN AndhraJyothy : ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. నిర్ధిష్ట గడువులోగా డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రార్‌లకు ఏమైనా మార్గదర్శకాలు జారీ చేశారా? అని ఆరా తీసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
Updated Date - Feb 20 , 2025 | 06:13 AM