ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Government : తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు

ABN, Publish Date - Jan 04 , 2025 | 03:50 AM

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వం విడుదల చేసే అన్ని ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది.

  • కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో జీవోల జారీకి ఆదేశం

  • అనువాద బాధ్యతలు డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్స్‌కు

  • ఉత్తర్వులు జారీ చేసిన జీఏడీ ముఖ్య కార్యదర్శి

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వం విడుదల చేసే అన్ని ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, నిబంధనలు, సూచనలు ప్రజలకు తేలికగా అర్థమయ్యేందుకు ఇంగ్లిష్‌తోతో పాటు తెలుగు లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని శాఖలను ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌. సురే్‌షకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం... జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో తొలుత ఇంగ్లి్‌షలో ఉత్తర్వుల కాపీ ఆప్‌లోడ్‌ చేసిన రెండు రోజుల్లోగా తెలుగు కాపీని కూడా ఆప్‌లోడ్‌ చేయాలి. లేదా తొలుత తెలుగు కాపీ అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఇంగ్లిష్‌ కాపీ అప్‌లోడ్‌ చేయవచ్చు. తెలుగు, ఇంగ్లిష్‌ కాపీలు ఒకేసారి ఆప్‌లోడ్‌ చేసే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. జీవోలను తెలుగులోకి అనువదించే బాధ్యతలను డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్స్‌కు అప్పగించింది. ఆయా శాఖలు విడుదల చేసిన జీవోలను ట్రాన్స్‌లేషన్‌ విభాగం రెండు రోజుల్లో అనువదించి సంబంధిత శాఖలకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల జీవోలను తెలుగులో కూడా అప్‌లోడ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jan 04 , 2025 | 03:51 AM