ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కరెంటు చార్జీలు తగ్గించండి

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:18 AM

పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత చార్జీలు తగ్గించి, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట తాడిపత్రి నియోజకవర్గంలో సాగు, తాగునీరు ఇబ్బందిలేకుండా మంచి పంటలు పండేవన్నారు.

తాడిపత్రి, మార్చి10(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత చార్జీలు తగ్గించి, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట తాడిపత్రి నియోజకవర్గంలో సాగు, తాగునీరు ఇబ్బందిలేకుండా మంచి పంటలు పండేవన్నారు. కొంతకాలంగా సాగు, తాగునీరు లేకపోవడంతో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. కానీ ఈ ప్రాంతంలో రా మెటీరియల్‌ లేకపోయినా వందల కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చి గ్రానైట్‌, నల్లబండల పరిశ్రమలు స్థాపించి 30వేల నుంచి 40వేల వరకు కార్మికులకు ఉపాధి కల్పించేవారు అన్నారు. దాదాపు 1800 పరిశ్రమలు ఉండేవని వాటివల్ల నియోజకవర్గంలోని ప్రజలు, వ్యాపారస్తులు బాగుండేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత చార్జీలు పెంచడం, రాయితీలు తగ్గించడంతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. దీనివల్ల దాదాపు 20వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిశ్రమలకు విద్యుత చార్జీలు యూనిట్‌కు రూ.8 నుంచి 9వరకు ఉన్నాయని వాటిని రూ.2లకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా ఇనచార్జ్‌ మంత్రి, పరిశ్రమలశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

Updated Date - Mar 11 , 2025 | 12:18 AM