CHAIRMAN ELECTION: లైన క్లియర్..!
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:06 AM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ చైర్మన ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికకు సంబంఽధించిన నోటిఫికేషనను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది.
3న ప్రక్రియ
టీడీపీ వశమైనట్లేనా?
హిందూపురం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ చైర్మన ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికకు సంబంఽధించిన నోటిఫికేషనను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఆరు నెలలుగా ఊరిస్తున్న మున్సిపల్ చైర్మన పీఠం తెలుగుదేశం పార్టీ వశం కానుంది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తరఫున చైర్మన అభ్యర్థిగా డీఈ రమేష్ పేరు ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖరారు చేశారు. ఇక ఎన్నిక లాంఛనమని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
హిందూపురం మున్సిపల్ ఎన్నికలు 2021లో నిర్వహించారు. మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా.. ఇందులో అప్పుడు వైసీపీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 6, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్య్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో గెలిచారు. అప్పట్లో 19వ వార్డు నుంచి గెలుపొందిన వైసీపీ కౌన్సిలర్ ఇంద్రజను చైర్‌పర్సనగా ఎన్నుకున్నారు.
వైస్ చైర్మనకు అవకాశం
గతేడాది ఆగస్టులో చైర్‌పర్సన తన పదవికి రాజీనామా చేయంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో మూడు నెలలు దాటిపోతున్నా చైర్మన ఎన్నికకు నోటిఫికేషన రాకపోవడంతో నవంబరులో ప్రస్తుతం రెండో వైస్ చైర్మనగా ఉన్న బలరాంరెడ్డిని ఎంపిక చేసి ఎన్నికల సంఘం తాత్కాలిక చైర్మనగా నియమించింది. దీంతో ఆయన మున్సిపల్ చైర్మనగా నవంబరు ఆఖరి వారంలో ప్రమాణ స్వీకారం చేశారు. నవంబరు 20న మున్సిపల్ తాత్కాలిక చైర్మనగా బలరాంరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
నోటిఫికేషన జారీ
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ చైర్మన ఎన్నికలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన జారీ చేసింది. అందులో హిందూపురం చైర్మన ఎన్నిక కూడా ఉంది. చైర్మన ఎన్నికకు సంబంధించి ఈనెల 30న కౌన్సిలర్లకు సమావేశం ఏర్పాటు చేస్తామని నోటిఫికేషన ఇవ్వనున్నారు. వచ్చేనెల 3న 11 గంటలకు హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, చైర్మనను ఎన్నుకోనున్నారు. అనివార్య కారణాల వల్ల 3న వాయిదా పడితే మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 4న చైర్మన ఎన్నికకు అవకాశం ఇస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో..
వైసీపీ తరఫున చైర్‌పర్సనగా ఇంద్రజ మూడున్నర్రేళ్లు కొనసాగారు. ఆమె అప్పట్లో వైసీపీ ఇనచార్జి మహ్మద్ ఇక్బాల్ వర్గం కావడంతో చైర్మన పదవికి ఇబ్బందిలేకుండా సాగింది. వైసీపీ ఇనచార్జి నుంచి ఆయనను తొలగించి, దీపికకు బాధ్యతలు అప్పగించడంతో మున్సిపల్ చైర్మన వర్సెస్ వైసీపీ ఇనచార్జిగా పోరు సాగింది. దీంతో చైర్‌పర్సన.. ఇనచార్జి వర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ తరుణంలో గతేడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎంఐఎం, వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతేడాది ఆగస్టులో మున్సిపల్ చైర్‌పర్సన ఇంద్రజతోపాటు, ఎనిమిది మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ మరుసటిరోజే ఇంద్రజ తన చైర్‌పర్సన పదవికి రాజీనామా చేశారు. దీంతో చైర్మన ఎన్నిక అనివార్యమైంది.
లాంఛనమేనా?
2021లో వైసీపీ వశమైన హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ వశం కావడం లాంఛనమేనని తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన ఎన్నికకు 20మంది కౌన్సిలర్లు అవసరం. తెలుగుదేశం పార్టీకి 22 మంది కౌన్సిలర్లతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కూ డా ఉండటంతో సంఖ్యాబలం 24కు చేరింది. ఈ నేపథ్యంలో చై ర్మన సీటు తెలుగుదేశం పార్టీ వశమైనట్లేనన్న చర్చ సాగుతోం ది. చైర్‌పర్సనపదవికి రాజీనామా చేసిన ఇంద్రజ వాల్మీకి సా మాజికవర్గానికి చెందిన వారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీంతో 6వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా కొనసాగుతున్న డీ ఈ రమేష్ చైర్మన కావడానికి లైన క్లియర్ అయినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు నెలల క్రితమే మున్సిపల్ చై ర్మన ఎన్నిక జరుగుతుందని భావించి టీడీపీ తరఫున గెలుపొందిన ఆరుగురు సభ్యులతోపాటు వైసీపీ నుంచి పార్టీలో చేరిన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అప్పట్లో చైర్మన ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన విడుదల చేయకపోవడంతో పదిరోజులపాటు ఇతర ప్రాంతాల్లో విహారయాత్రకు వెళ్లిన స భ్యులు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యులు విహార కేంద్రానికి వెళ్లే అవసరం ఉంది. ఏది ఏమైనా ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న మున్సిపల్ చైౖర్మన ఎన్నిక ఎట్టకేలకు వచ్చేనెల 3న నిర్వహించనున్నారు.
Updated Date - Jan 28 , 2025 | 12:06 AM