CHESS: చెస్‌తో మేధాశక్తిని పెంపొందించుకోవచ్చు
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:10 AM
చెస్‌తో క్రీడతోమేధాశక్తిని పెంపొందించుకోవచ్చని ఏపీ చెస్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని కొత్తపేట శ్రీఉషోదయ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో శనివారం హైబ్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ రాష్ట్రాస్థాయి ఓపెన చెస్ పోటీలను సత్యనారాయణ, కార్యదర్శి సుమన ప్రారంభించారు.
ధర్మవరం, ఫిబ్రవరి 8(ఆంద్రజ్యోతి): చెస్‌తో క్రీడతోమేధాశక్తిని పెంపొందించుకోవచ్చని ఏపీ చెస్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని కొత్తపేట శ్రీఉషోదయ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో శనివారం హైబ్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ రాష్ట్రాస్థాయి ఓపెన చెస్ పోటీలను సత్యనారాయణ, కార్యదర్శి సుమన ప్రారంభించారు. అన్ని జిల్లాల నుంచి 270 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమన్నారు. ముఖ్యంగా చెస్ అంటే మెదడును ఉపయోగించి ఆడేదన్నారు. ఏటా ఇదే పాఠశాలలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి క్రీడలోనూ గెలుపోటములు సహజమని వాటిని స్పోర్టీవ్‌గా తీసుకోవాలన్నారు. ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుందని, గెలుపొందిన విజేతలకు బహుమతులు అందిస్తామని హైబ్రో చెస్ అకాడమీ అధ్యక్షుడు జాకీర్‌హుస్సేన తెలిపారు. యువర్స్‌పౌండేషన ప్రసిడెంట్ శీలానాగేంద్ర, సెక్రటరీ జయరాం, ట్రెజరర్ మోహన, ఆర్గనైజింగ్ ప్రసిడెంట్ చాంద్‌బాషా, టోర్నీ హానరబుల్ ప్రసిడెంట్ డాక్టర్ బీవీ సుబ్బారావు, చెస్ అకాడమీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన, వైకే శ్రీనివాసులు, రమేశబాబు పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 12:10 AM