TIRUNALA: అశ్వత్థనారాయణ తిరునాళ్లకు ఏర్పాట్లు
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:08 AM
మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి చక్రస్థాపన భీమలింగేశ్వరస్వామి మాఘమాసం సందర్భంగా మూడో ఆదివారం జరగనున్న తిరునాళ్ల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు.
పెద్దపప్పూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి చక్రస్థాపన భీమలింగేశ్వరస్వామి మాఘమాసం సందర్భంగా మూడో ఆదివారం జరగనున్న తిరునాళ్ల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. శనివారం సాయంత్రం సాంస్కృతిక కార్యకలాపాలతో వచ్చిన భక్తాదులకు ఏర్పాట్లు అంతేకాకుండా తిరుణాళ్లకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహిళలకు ప్రత్యేక స్నానగదులు ఆర్టీసీ అధికారులచే ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు భారీ బందోబస్తు పోలీస్ బలగాలతో తిరునాళ్లకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 2గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని ఆలయ ఈఓ తెలిపారు. తిరుణాలకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పెద్దవడుగూరు సీఐ వెంకటసుబ్బయ్య, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
Updated Date - Feb 16 , 2025 | 12:08 AM