Seeleru Police Station : ఏకే 47 మిస్ ఫైర్!
ABN, Publish Date - Jan 29 , 2025 | 05:38 AM
ఏకే 47 మిస్ ఫైర్ అయి స్పెషల్ పార్టీ ఆర్‌ఎస్ఐ కాలికి గాయమైంది.
స్పెషల్ పార్టీ ఆర్‌ఎస్ఐ కాలికి గాయం.. గోప్యంగా ఉంచిన పోలీసులు
సీలేరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్‌లో ఏకే 47 మిస్ ఫైర్ అయి స్పెషల్ పార్టీ ఆర్‌ఎస్ఐ కాలికి గాయమైంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. సోమవారం సాయంత్రం సీలేరు పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ పార్టీకి కేటాయించిన గది వద్ద ఆర్‌ఎ్‌సఐ కె.హరీష్ ఏకే 47లోని మ్యాగ్జైన్‌ను బయటకు తీసి శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ అయి కుడి కాలి పాదానికి గాయమైంది. వెంటనే ఆయన్ను సీలేరు, చింతపల్లి పీహెచ్‌సీలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏకే 47 మ్యాగ్జైన్ తొలగించే క్రమంలో ఒక రౌండ్ అందులో ఉండిపోవడంతో మిస్‌ఫైర్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 29 , 2025 | 05:38 AM