Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ABN, Publish Date - Mar 04 , 2025 | 06:47 PM
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
APPSC
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ తో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫాం సర్వీసెస్‌కు 2 సంవత్సరాల వయో పరిమితి, నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు వయో పరిమితిని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Updated Date - Mar 04 , 2025 | 06:48 PM