స్పీకర్ నిర్ణయం తీసుకునేదెప్పుడు..?
ABN, Publish Date - Aug 06 , 2024 | 09:44 AM
హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఆరు నెలలా? ఏడాదా? రెండేళ్లా? మూడేళ్లా? ఎంత సమయం పడుతుంది? అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించింది.
హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఆరు నెలలా? ఏడాదా? రెండేళ్లా? మూడేళ్లా? ఎంత సమయం పడుతుంది? అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను ఎన్నిరోజులు పెండింగ్‌లో ఉంచాలని అడిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ కొనసాగించారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు ప్రస్తావించిన కైశం మేఘాచంద్రసింగ్, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హోలోహన్ కేసులు ప్రస్తుత సందర్భానికి వర్తించవని తెలిపారు. అత్యంత తాజాగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మహారాష్ట్రకు సంబంధించిన ‘సుభాష్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ’ కేసును ప్రస్తావించారు. అందులో సుప్రీంకోర్టు ‘తగిన సమయం (రీజనబుల్ టైం)’ అని ప్రస్తావించిందే తప్ప.. కచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేదని పేర్కొన్నారు. గతంలోఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్ యాదవ్’ కేసు ఇప్పటికీ అమలులో ఉందని గుర్తుచేశారు. స్పీకర్ అధికారాల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ ఎంవోయు..
జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం..
వైసీపీ నేతలకు వణుకుపుట్టిస్తున్న మంత్రి..
అమెరికాను వణికిస్తున్న మాంద్యం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 06 , 2024 | 09:44 AM