Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
ABN, Publish Date - Jul 23 , 2024 | 12:21 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారన్నారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని.. కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరమని అన్నారు. సాయన్న మృదుస్వభావి అని, రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారని సీఎం కొనియాడారు.
కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న కోరిక అని.. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. లాస్య నందిత బ్రతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారన్నారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని స్పష్టం చేశారు. సాయన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ (ఫోటో గ్యాలరీ)
కారు దిగనున్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!
ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 23 , 2024 | 12:21 PM