ఆరు అంశాలతో టీడీపీ అజెండా..
ABN, Publish Date - Aug 08 , 2024 | 11:12 AM
అమరావతి: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం గురువారం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అమరావతి: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం గురువారం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరు అంశాలతో ఎజెండాను రూపొందించారు. సంస్థాగత వ్యవహారాలతోపాటు నామినేటెడ్ పదువులు, టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, శాసనమండలి ఎన్నికలవంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
వైసీపీ విధ్వంసాలపై కొన్ని రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేత పత్రాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తారు. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అవినీతి, అక్రమాలను కూడా ప్రజలకు మరింతగా వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లురాని అనేకమంది నేతలు నియామక పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కీలకమైన ఈ పదవుల ఎంపికపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
Updated Date - Aug 08 , 2024 | 11:12 AM