రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు..
ABN, Publish Date - Apr 11 , 2024 | 07:18 AM
హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజులు ఆచరించి పండుగ జరుపుకుంటున్నారు. నిన్న (బుధవారం) నెలవొంక కనిపించడంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటున్నారు.
హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజులు ఆచరించి పండుగ జరుపుకుంటున్నారు. నిన్న (బుధవారం) నెలవొంక కనిపించడంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటున్నారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాకు వెళ్లి నమాజు చేస్తున్నారు.
Updated Date - Apr 11 , 2024 | 07:18 AM