ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
ABN, Publish Date - Sep 01 , 2024 | 08:58 AM
అమరావతి: ప్రకాశం బ్యారేజీ దగ్గర గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 5,66,860 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
అమరావతి: ప్రకాశం బ్యారేజీ దగ్గర గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 5,66,860 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజు నుంచి కాల్వలకు 5 వందల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,67,360 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజి నీటి మట్టం 15 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది.
నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని, పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం
ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 01 , 2024 | 08:58 AM