అలాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత: బాబు
ABN, Publish Date - Aug 26 , 2024 | 07:09 AM
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ భవనంలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆదివారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించిన ఆయన.. ఇప్పటి వరకు ఉన్న కమిటీలను రద్దు చేశారు. పార్టీని క్షేత్రస్థాయినుంచి బలోపేతం చేయాలని నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ భవనంలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆదివారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించిన ఆయన.. ఇప్పటి వరకు ఉన్న కమిటీలను రద్దు చేశారు. పార్టీని క్షేత్రస్థాయినుంచి బలోపేతం చేయాలని నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేసిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు.
తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లవంటివని.. రెండు ప్రాంతాలు సమ అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా.. గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో.. ‘తాగేస్తున్నారు’!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 26 , 2024 | 10:44 PM