తాడేపల్లి వైసీపీ ఆఫీసుకు నోటీసులు..
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:54 PM
అమరావతి: తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని పేర్కొంటూ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
అమరావతి: తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి (YCP Office) పోలీసులు (Police) నోటీసులు (Notices) పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై (TDP Offoce) దాడికి (Attack) సంబంధించి సీసీ టీవీ పుటేజ్ (CCTV Footage) ఇవ్వాలని పేర్కొంటూ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే మంగళగిరి పోలీసులు వైసీపీ కార్యాలయం నిర్వహకులను కోరగా.. తమ వద్ద ఎలాంటి సీసీ టీవీ పుటేజ్ లేదని చెప్పి.. నోటీసులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోల్‌కతా కేసు.. ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐల సస్పెన్షన్..
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం దృశ్యాలు..
ఆ నిధులు వైఎస్ జగన్ ఏం చేశారు..?
నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్
కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 21 , 2024 | 01:54 PM