వారిని కాపాడేందుకు మంత్రి లోకేశ్ చర్యలు..
ABN, Publish Date - Aug 06 , 2024 | 01:20 PM
అంబేడ్కర్ కోమసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం శివారువీధివారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అబుదాబీలో ఇబ్బందులు పడుతోంది. తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసింది బాధిత మహిళ. తనను ఇండియాకు తీసుకురావాలంటూ ప్రాదేయపడుతోంది.
అంబేడ్కర్ కోమసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం శివారువీధివారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అబుదాబీలో ఇబ్బందులు పడుతోంది. తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసింది బాధిత మహిళ. తనను ఇండియాకు తీసుకురావాలంటూ ప్రాదేయపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఏజెంట్ ద్వారా నాలుగు నెలల క్రితం అబుదాబీకి వెళ్లింది కాశీ జ్యోతి. తినడానికి తిండి, తాగడానికి నీరు, సరైన వసతులు లేక అనారోగ్యంతో ఉన్నానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన హసీనా అనే మహిళ కూడా సౌదీలో అష్టకష్టాలు పడుతోంది. నిమ్మనపల్లె గ్రామానికి చెందిన ఆమె తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాన్ని ఓ వ్యక్తి లోకేశ్‌కు ట్యాగ్ చేయగా వెంటనే ఆయన స్పందించారు. హసీనాను ఇండియాకు సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీచర్లకు ఆ భారం తప్పించిన ఏపీ ప్రభుత్వం..
సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టిన చింతా మోహన్
కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)
తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ ఎంవోయు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 06 , 2024 | 01:53 PM