ఎలియన్‌కి ఆలయం నిత్యం పూజలు..!
ABN, Publish Date - Aug 06 , 2024 | 12:14 PM
తమిళనాడులో ఓ వ్యక్తి ఎలియన్స్‌కు దేవాలయాన్ని నిర్మించి.. నిత్యం పూజలు చేస్తున్నాడు. ముల్లముప్పంపట్టి సమీపంలోని రామగౌనుర్‌కు చెందిన సిద్దర్ భాగ్య స్థానికంగా శివాలయం నిర్మించారు. మూలమూర్తిగా మహా శివుడిని ప్రతిష్టించారు. ఒక మండపంలో ఆగస్త్య మహా ముని విగ్రహం, మరో మండపంలో గ్రహంతర వాసి ఎలియన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవుళ్లతోపాటు ఎలియన్‌కు సైతం ఆయన నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.

లయ కారకుడు శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహంతర వాసులు పుట్టారని తెలిపారు. ఈ విషయాన్ని ఆగస్త్య మహాముని తన గ్రంధాల్లో పేర్కొన్నారని సిద్దర్ భాగ్య గుర్తు చేశారు. ఎలియన్స్‌తో మాట్లాడిన తర్వాతే తాను ఈ గుడిలో వారి విగ్రహం ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేయడం గమనార్హం. అదీకాక ప్రపంచంలోనే గ్రహంతవాసి కోసం నిర్మించిన తొలి దేవాలయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి ఎలియన్స్ రక్షిస్తాయన్నారు. అలాగే ఎలియన్స్ ఎలా పూజించాలో కూడా సిద్దర్ భాగ్య వివరించారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 06 , 2024 | 12:14 PM