ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోలుకోలేని స్థితిలో ఖమ్మం వాసులు

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:35 PM

ఖమ్మం జిల్లా: మున్నేరు.. ఈ పేరు చెబితేనే ఇప్పుడు వణుకొచ్చేస్తోంది. మున్నేరు ఉగ్రరూపం కళ్లెదుట కనిపిస్తునే ఉంది. ఖమ్మం దుఃఖదాయినిగా మారి పరిసర ప్రాంత ప్రజలు కోలుకోలేని పరిస్థితి సృష్టించింది. ఇళ్లు, పొలం, రోడ్లు, బ్రిడ్జిలు.. ఇలా ఒకటేమిటి.. అన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. వందేళ్లలో చరిత్ర చూడని వరద..

ఖమ్మం జిల్లా: మున్నేరు.. ఈ పేరు చెబితేనే ఇప్పుడు వణుకొచ్చేస్తోంది. మున్నేరు ఉగ్రరూపం కళ్లెదుట కనిపిస్తునే ఉంది. ఖమ్మం దుఃఖదాయినిగా మారి పరిసర ప్రాంత ప్రజలు కోలుకోలేని పరిస్థితి సృష్టించింది. ఇళ్లు, పొలం, రోడ్లు, బ్రిడ్జిలు.. ఇలా ఒకటేమిటి.. అన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. వందేళ్లలో చరిత్ర చూడని వరద.. ఇంకా అదుపులోని రాని మున్నేరు ఉగ్రరూపం.. నిరాశ్రయులుగా మారిన వేలాది మంది జనం.. గ్రామీణ ప్రాంతాలు సయితం అతలాకుతలం.. మొన్నటి వరకు సాగు, తాగునీరు అవసరాలను తీర్చిన మున్నేరు నేడు ఉగ్ర రూపం దాల్చింది. మున్నేరు పరివాహక ప్రజలు సర్వం కోల్పోయారు. మున్నేరు వరద ఎన్నో ఇండ్లు, భూములు, పంటలు, ఆస్తులను తనలో కలిపేసుకుంది. ఎంతోమంది నిరుపేదలను నిరాశ్రయులుగా మార్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీట ముంచి అన్నదాలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది.


ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలో వరద ముప్పు పెరగడంతో వరద బాధితులు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరుకోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


ఎడతెరిపి లేకుండా భారీ వర్షం ఖమ్మం నగరంలో కురుస్తోంది. దీంతో 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరింది. మున్నేరు పరివాహక ప్రాంతాలైన రామన్నగూడెం, దానవాయిగూడెం, ప్రకాశ్ నగర్, మోతీ నగర్, వేంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, పెద్దతండా, సాయి గణేష్ నగర్ మున్నేరు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.

Updated Date - Sep 09 , 2024 | 12:35 PM

Advertising
Advertising