కాళేశ్వరం స్కాంలో దొరికిపోయిన మామ, అల్లుడు
ABN, Publish Date - Aug 23 , 2024 | 09:38 AM
హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు/డ్రాయింగ్‌లపై సంతకాలు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్‌సీ బి.హరిరాం తనపై ఒత్తిడి చేశారన్నారు. 3 డీ అధ్యయనం తర్వాత డి జైన్లు/డ్రాయింగ్‌లు రూపొందించాల్సి ఉండగా... 2 డీ అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా నరేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు/డ్రాయింగ్‌లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి, ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారని నరేందర్‌రెడ్డి కమిషన్‌కు చెప్పారు. కాళేశ్వరం డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకాలు ఎందుకు పెట్టడంలేదు? సమస్య ఏంటని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీశ్ రావు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తర్వాత హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్‌లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని హరిరాం లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టానని నరేందర్‌రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..
ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..
తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ..?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 23 , 2024 | 09:38 AM