ఆపరేషన్ హైడ్రా.. గండిపేటలో కూల్చివేతలు ..
ABN, Publish Date - Aug 19 , 2024 | 08:45 AM
హైదరాబాద్: చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..! ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు.. మొత్తం వివరాలను తవ్వి తీస్తోంది..! నిజానిజాలను నిర్ధారించుకుని నేరుగా రంగంలోకి దిగుతోంది..!
హైదరాబాద్: చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..! ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు.. మొత్తం వివరాలను తవ్వి తీస్తోంది..! నిజానిజాలను నిర్ధారించుకుని నేరుగా రంగంలోకి దిగుతోంది..! హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. గండిపేట చెరువు పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం (ఎఫ్‌టీఎల్)లో వెలసిన నిర్మాణాలపై ఆదివారం కన్నెర్ర జేసింది.
జంట నగరాలకు తాగునీటి వనరైన గండిపేట (ఉస్మాన్ సాగర్) ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలను యంత్రాలతో కూల్చివేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులకు చెందిన భవనాలు ఉండడం గమనార్హం. గండిపేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూల్చివేతలు ఇదే ప్రథమమని స్థానికులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం సిద్ధరామయ్య వర్సెస్ గవర్నర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 19 , 2024 | 08:46 AM