ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏజెన్సీలో పలుప్రాంతాలు అతలాకుతలం ..

ABN, Publish Date - Sep 10 , 2024 | 10:24 AM

అల్లూరి జిల్లా: అరకులో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఏజెన్సీలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మైదాన ప్రాంతాల కంటే ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాజ్‌వే డ్యామ్‌లు దెబ్బ తినగా రిజర్వాయర్లు నిండి రోడ్లపైకి వరదనీరు వచ్చింది.

అల్లూరి జిల్లా: అరకులో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఏజెన్సీలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మైదాన ప్రాంతాల కంటే ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాజ్‌వే డ్యామ్‌లు దెబ్బ తినగా రిజర్వాయర్లు నిండి రోడ్లపైకి వరదనీరు వచ్చింది. ప్రభుత్వం తమకు శాస్వత పరిష్కారం చూపాలని గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరి సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడింది.


అల్లూరి జిల్లా, అరకులోయ, పాడేరు, జీకే వీధి, సీలూరు పలు ప్రాంతాల్లో గిరిజనులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక వైపు గర్భిణి స్త్రీలు ఆస్పత్రికి చేరుకోలేకపోతుంటే.. మరో వైపు మృత దేహాలతో అంతిమ యాత్రకు సయితం వాగులు దాటాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు నిండిపోవడంతో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయం గుప్పెట్లో బతుకున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కొండవాలు ప్రాంతాల్లో నివశిస్తున్న గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అకాల వర్షాల కారణంగా పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి.

Updated Date - Sep 10 , 2024 | 10:27 AM

Advertising
Advertising