రైతుకు దొరికిన వజ్రం.. ధర ఎంతంటే..
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:51 PM
కర్నూలు జిల్లా: తొలకరి చినుకులు పడిన వేళ కొన్ని గ్రామాల్లో వజ్రాలు లభిస్తాయి. దీంతో ప్రజలు తమ తమ పొలాల్లో వజ్రాల వేటను కొనసాగిస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతనికి ఏకంగా రూ.8 లక్షల విలువైన డైమాండ్ దొరికింది.
కర్నూలు జిల్లా: తొలకరి చినుకులు పడిన వేళ కొన్ని గ్రామాల్లో వజ్రాలు లభిస్తాయి. దీంతో ప్రజలు తమ తమ పొలాల్లో వజ్రాల వేటను కొనసాగిస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతనికి ఏకంగా రూ.8 లక్షల విలువైన డైమాండ్ దొరికింది. తుగ్గలి మండలంలోని సూర్యతండా గ్రామంలో ఈ ఘటన జరిగిందది. కర్నూలు జిల్లాలో వర్షాలకు భూ గర్భంలో ఉన్న వజ్రాలు బయటపడుతున్నాయి. కర్నూలు జిల్లా, తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, మదనంతాపురం,, బట్నేపల్లి, ఎర్రవల్లి గ్రామాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలో అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాలు.. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పొలాల్లో తిరుగుతూ.. రాళ్లు కదుపుతూ వజ్రాన్వేషణ సాగిస్తున్నారు. వజ్రాలు దొరికితే కొనడానికి కర్నూలు జిల్లా, పెరవలి, జొన్నగిరి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు తమ ఏజెంట్లను పొలాలవద్దే ఉంచుతున్నారు. వజ్రం దొరికితే బరువు, రంగు, రకాన్ని బట్టి.. క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. అయితే ఇదంతా చీకటి వ్యాపారమే.
కాగా తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి అదృష్టం కలిసోచ్చింది. ఒక్కసారిగా జాక్ పాట్ తగలడంతో ఆ గిరిజన బిడ్డ ఉబ్బితబ్బియ్యాడు. అసలేం జరిగిందంటే.. తుగ్గలి మండలం సూర్యతాండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీ పొలం పనులు చేస్తున్నాడు. ఇంతలో అతని కంటికి ఏదో కనిపించింది. ఏంటా అని పరీక్షపెట్టి చూడగా.. తెల్లగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని గమనించిన అతనికి వజ్రం అని అనుమానం కలిగింది. తోటి కూలీలు చూసి అది వజ్రమే అని చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న నిమర్జనం..
పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన..
సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్
జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 18 , 2024 | 12:51 PM