జగన్‌కు రోజా బై బై.. టీఎంకేలోకి జంప్..?
ABN, Publish Date - Aug 25 , 2024 | 10:36 AM
చెన్నై: జగన్‌కు మాజీ మంత్రి రోజా బైబై చెప్పి.. తమిళ రాజకీయాల్లో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తు్న్న మాట. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం.. టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు.
చెన్నై: జగన్‌కు మాజీ మంత్రి రోజా బైబై చెప్పి.. తమిళ రాజకీయాల్లో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తు్న్న మాట. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం.. టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు. ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్. ఆమె భర్త సెవ్వమణి తమిళ సినీ దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని.. అక్కడకు మాకాం మార్చుకునే పనిలో ఉన్నారని తెలియవచ్చింది.
మరోవైపు 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవ్చని టాక్. పార్టీతోపాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్‌ను సెంటిమెంట్‌తోపాటు ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నారట. బెదిరించి సీటు తెచ్చుకున్నా.. గెలవలేదు. మరో పార్టీలో చేరదామనుకున్నా అవకాశం లేదు. ఏపీసీసీ చీష్ షర్మిలను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలపై కూడా నోరుపారేసుకున్నారు. దీంతో కూటమి పార్టీలోచేరేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారట.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు
టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..
హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?
అప్పులు తగ్గించి.. అభివృద్ధిపై సీఎం ఫోకస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 25 , 2024 | 10:36 AM