మణి అన్నపురెడ్డిపై హైకోర్టులో ఫిర్యాదు..
ABN, Publish Date - Apr 16 , 2024 | 11:23 AM
అమరావతి: న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ ఫిర్యాదు చేయనున్నారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా.. సీబీఐ పట్టించుకోవడంలేదంటూ..
అమరావతి: న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ ఫిర్యాదు చేయనున్నారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా.. సీబీఐ పట్టించుకోవడంలేదంటూ లక్ష్మినారాయణ హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు ఫిర్యాదు చేయనున్నారు. కాగా గతంలో జడ్జీలను దూషించిన వ్యవహారంలో లక్ష్మినారాయణ హైకోర్టుకు ఫిర్యాదు చేయగా కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే మణి అన్నపురెడ్డి విదేశాల్లో ఉన్నారని సీబీఐ గతంలో హైకోర్టుకు తెలిపింది. అతనికి నోటీసులు జారీ చేసి ఇంటర్‌పోల్ సహాయం కూడా తీసుకుంటున్నామని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 16 , 2024 | 11:23 AM