ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Sep 07 , 2024 | 01:53 PM

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు వచ్చినా అతి తక్కువ నష్టంతో బయటపడినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. వినాయకుడి దయ వల్లే రాష్ట్రం భారీ విపత్తు నుంచి తప్పించుకుందని ఆయన చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు వచ్చినా అతి తక్కువ నష్టంతో బయటపడినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. వినాయకుడి దయ వల్లే రాష్ట్రం భారీ విపత్తు నుంచి తప్పించుకుందని ఆయన చెప్పారు. ఖైరతాబాద్ (khairatabad) వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యకలాపాలు నిర్వర్తిస్తోందన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా నిర్వహించడం గర్వకారణమన్నారు. 1954 నుంచి 2024 వరకూ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని రేవంత్ అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు దేశంలో గొప్ప గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు.


Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 07 , 2024 | 01:58 PM

Advertising
Advertising