ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొదటిసారిగా ‘భూధార్‌ కార్డు’

ABN, Publish Date - Aug 08 , 2024 | 08:52 AM

హైదరాబాద్: రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా ‘భూధార్‌ కార్డు’ రాబోతుంది. వ్యక్తులకు ఆధార్‌ కార్డు మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్‌ కార్డు జారీ చేయనున్నారు. దీన్ని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు ఇవ్వనున్నారు.

హైదరాబాద్: రెవెన్యూ చట్టంలో (Revenue Act) మొదటిసారిగా ‘భూధార్‌ కార్డు’ (Bhoodhar card) రాబోతుంది. వ్యక్తులకు ఆధార్‌ కార్డు (Aadhaar card) మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్‌ కార్డు జారీ చేయనున్నారు. దీన్ని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు ఇవ్వనున్నారు. దీంతో సంబంధిత భూమి సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఎలక్ట్రా నిక్‌ రూపంలో ఉంటుంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్‌)లో భూధార్‌ కార్డుకు ప్రత్యేక స్థానం కల్పిస్తోంది.


ఈ చట్టం అమల్లోకి రాగానే రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కమతాని(భూమి)కి భూధార్‌ నెంబరు కేటాయించనున్నారు. అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుంది. భూములు రీసర్వే చేసిన తర్వాత శాశ్వత గుర్తింపు నెంబరు జారీ చేస్తారు. కొత్త ఆర్వోఆర్‌-2024 చట్టం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని రెవెన్యూ, న్యాయ నిపుణులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం సీసీఎల్‌ఏలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్‌, లేఖల ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రజాభిప్రాయాలు సేకరించనున్నారు. వాటిలో వచ్చే అభ్యంతరాలు, సలహాలు, సూచనల మేరకు ముసాయిదాలో మార్పులు చేర్పులు చేస్తారు. అనంతరం అసెంబ్లీ ఆమోదంతో చట్టంగా మారనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..

ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు..

వినేశ్‌ విలాపం

చుక్కల భూములకు చెక్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 08 , 2024 | 08:52 AM

Advertising
Advertising