తెల్ల కొంగ.. నల్ల కొంగ
ABN, Publish Date - May 18 , 2024 | 10:49 PM
ఏంటీ... దున్నిన తరి పొలంలో కాకులు, కొంగలు ఇలా ఉన్నాయని ఆ శ్చర్యపోతున్నారా... అందులో కనిపించేవి కాకులు కాదు.
ఏంటీ... దున్నిన తరి పొలంలో కాకులు, కొంగలు ఇలా ఉన్నాయని ఆ శ్చర్యపోతున్నారా... అందులో కనిపించేవి కాకులు కాదు. నల్లటి రంగులో ఉన్నవి కూడా కొంగలే. సాధారణంగా మనం తెల్ల కొంగలను చూసి ఉంటాం. అప్పుడప్పుడూ నల్లవాటినీ చూసి ఉంటాం. కానీ, ఇక్కడ రెండు రంగులున్న కొంగలు ఒకేచోట కనిపించాయి. నల్లజాతి, తెల్లజాతి కొంగలన్నీ ఒకేచోట ఆహారం కోసం వెతుకుంటున్నాయి. యాచారం మండలంలోని చిన్నతూండ్లలో శనివారం నల్లజాతి, తెల్లజాతి కొంగలు ఒకేచోట చేరి సందడి చేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఔరా అనుకుంటున్నారు.
యాచారం, మే 18
Updated Date - May 18 , 2024 | 10:49 PM