ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి
ABN, Publish Date - Jun 28 , 2024 | 12:12 AM
ఆరోగ్యవంతమైన సమా జం క్రీడా మైదానాల నుంచే ప్రా రంభమవుతుందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి
తిరుమలగిరి(సాగర్), జూ న 27: ఆరోగ్యవంతమైన సమా జం క్రీడా మైదానాల నుంచే ప్రా రంభమవుతుందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని బో యగూడెం గ్రామంలో గురువారం ఎంసీకేఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢ త్వం అలవడుతుందని అన్నారు. గ్రామాల మధ్యస్నేహ సంబంధాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయన క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అల్లి పెద్దిరాజుయాదవ్, మాజీ సర్పంచ నెమలి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షు డు బీవీ రమణరాజు, నాయకులు వంగూరి కృష్ణప్రసాద్, వంగూరి రేణుకబుజ్జ య్య, కిశోర్‌నాయక్, కూనరెడ్డి లింగారెడ్డి, మాలె సత్యంరెడ్డి, దుర్గారెడ్డి, రవీంద్రచారి, నాగార్జున, క్రికెట్ నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, పొదిల మల్లయ్య, శ్రవణ్‌కుమార్, లింగాల రవి, రమేష్, జలందర్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2024 | 12:12 AM