అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉమాహారతి
ABN, Publish Date - Apr 16 , 2024 | 11:40 PM
ఐఏఎస్ అధికారిణి ఎన్.ఉమాహారతి అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022-23 బ్యాచ్ సివిల్ సర్వీసెస్‌లో ఆమె అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : ఐఏఎస్ అధికారిణి ఎన్.ఉమాహారతి అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022-23 బ్యాచ్ సివిల్ సర్వీసెస్‌లో ఆమె అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో తన ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించగా, ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఆమె సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యారు. ఆమె స్వస్థలం సూర్యాపేటజిల్లా, హుజూర్‌నగర్. ఉమాహారతి తండ్రి ఎన్.వెంకటేశ్వర్లు నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన విషయం తె లిసిందే. శిక్షణ పూర్తి చేసుకున్న ఉమాహారతికి అసిస్టెంట్ కలెక్టర్‌గా వికారాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఆమె జిల్లా కలెక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ధాన్యంకొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ నారాయణ రెడ్డి నిర్వహించిన సమీక్షాసమావేశంలో పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2024 | 11:40 PM