పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్ మల్లన్న
ABN, Publish Date - May 23 , 2024 | 12:18 AM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఆత్మీయ బంధువని ఆయన్ను గెలిపించాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స కార్పొరేషన చైర్మన ముత్తినేని వీ రయ్య అన్నారు.
పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్ మల్లన్న
దివ్యాంగుల సంక్షేమశాఖ ఫైనాన్స కార్పొరేషన చైర్మన వీరయ్య
మిర్యాలగూడ, నల్లగొండ టౌన, మే 22: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఆత్మీయ బంధువని ఆయన్ను గెలిపించాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స కార్పొరేషన చైర్మన ముత్తినేని వీ రయ్య అన్నారు. మిర్యాలగూడ, నల్లగొండలో బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థు లు పట్టభద్రుల ద్రోహులని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ ని యామకాలు చేపట్టకున్నా, ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని అన్నారు. తీ న్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా నిరుద్యోగులపై, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించారని అన్నారు. అందుకోసమే ప్రభుత్వం మల్లన్నపై కక్ష గట్టి జైలుకు పంపిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు పట్టభద్రులను ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్నెస్పీ కాం్యపు మైదానంలో ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. మైదానంలోని గ్రంథాలయంలో గ్రాడ్యుయేట్లను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్నార్ మల్లన్నకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున, ఎనఎ్‌సయూఐ నాయకులు ఇమ్రాన, సలీం, బీసీ నాయకులు పోలగాని వెంకటేశ్వర్లు గౌడ్, నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ముత్తినేని వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ యన పాల్గొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నాయకులు లతీఫ్, రవి, కొత్త వెంకన్న, మత్స్యగిరి, ముత్తయ్య, డి.శంకర్, ఎం.నాగరాజు, మాధవరెడ్డి, మధు, సైదు లు, సైదిరెడ్డి, బుచ్చిరాములు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2024 | 12:18 AM