ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్న జాతరకు వేళాయె..

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:09 PM

అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆషాడ మాస చిన్న జాతర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 16న(శుక్రవారం) ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

నేడు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న అనంతపద్మనాభుడి ఉత్సవాలు

ఆషాఢ మాస జాతరకు తరలిరానున్న భక్తజనం

వికారాబాద్‌, జూలై 15 : అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆషాడ మాస చిన్న జాతర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 16న(శుక్రవారం) ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 21న పౌర్ణమి రోజు పెరుగు బసంతంతో జాతర ముగియనుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు జరిగే ఉత్సవాల్లో చివరి రోజు పెరుగు బసంతంలో దైవ ప్రసాదం పొంది ఆ ప్రసాదాన్ని పంట పొలాల్లో చల్లుకుంటే బంగారం పండుతుందని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో 11రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:09 PM

Advertising
Advertising
<