మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
ABN, Publish Date - Apr 20 , 2024 | 11:38 PM
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం ఈవీఎం, వీవీ ప్యాట్‌ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 20 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం ఈవీఎం, వీవీ ప్యాట్‌ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శనివారం ఈవీఎం గోడౌన్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. గద్వాల నియోజకవ ర్గానికి బ్యాలెట్ యూనిట్లు 378, కంట్రోట్ యూనిట్లు 378, వీవీ ప్యాట్లు 424 కేటాయించగా, అలంపూర్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 363, కంట్రోల్ యూనిట్లు 363, వీవీ ప్యాట్‌లు 407ల ను కేటాయించినట్లు ఎన్ని కల అధికారి వివరించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరిచినట్లు తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్, వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నరేష్, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.
Updated Date - Apr 20 , 2024 | 11:38 PM