టెట్ పరీక్ష తేదీల ప్రకటన
ABN, Publish Date - May 04 , 2024 | 04:42 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ తేదీలను విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ తేదీలను విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇబ్బంది లేకుండా టెట్ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. మే 20, 21, 22 తేదీల్లో పేపర్-2 గణితం, సైన్స్ పరీక్ష, మే 24, 28, 29 తేదీల్లో పేపర్-2 సాంఘిక శాస్త్రం పరీక్ష, మే 30, 31 తేదీల్లో పేపర్-1, జూన్ 1న పేపర్- 2 గణితం, సైన్స్ (మైనర్ మీడి యం), జూన్ 2న పేపర్-1 పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, ఈనెల 20 నుంచి టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు అధికారులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
Updated Date - May 04 , 2024 | 09:41 AM