ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Apr 26 , 2024 | 11:35 PM
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనురాధ అన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న తహసీల్దార్ అనురాధ
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కొండమల్లేపల్లి, ఏప్రిల్ 26: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనురాధ అన్నారు. శుక్రవా రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో క ల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందని తెలిపారు. మం డల పరిధిలోని 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్ స్వప్న, జూనియర్ అసిస్టెట్ కవిత, నరేందర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2024 | 11:35 PM