ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

ABN, Publish Date - Dec 01 , 2024 | 04:21 AM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది.

  • బీసీ ఐఏఎస్‌ అధికారికి అవకాశం

  • ఐదేళ్లకు పైగా కొనసాగే చాన్స్‌

  • స్పెషల్‌ సీఎస్‌ పదోన్నతితో వీడ్కోలు

  • ఆ వెంటనే గవర్నర్‌ ఆమోదానికి ఫైలు

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. బీసీ వర్గానికి చెందిన ఆయనకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా, గవర్నర్‌ కార్యదర్శిగా, జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న వెంకటేశం ఆదివారమే ఐఏఎస్‌ పోస్టు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోనున్నారు. దీనికి ఆమోదం లభించగానే టీజీపీఎస్సీ చైర్మన్‌గా వెంకటేశం నియామక ఫైలు గవర్నర్‌ వద్దకు వెళ్లనుంది. గవర్నర్‌ ఆమోదంతో నియామక ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి బి.మహేందర్‌రెడ్డి డిసెంబరు 2న చైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఈ పదవిలో మరొకరిని నియమించడానికి ఈ నెల 11నే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, టీజీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ, ఈ పోస్టులో బీసీ అధికారిని నియమించాలన్న కృతనిశ్చయానికి వచ్చిన ప్రభుత్వం... సీనియర్‌ ఐఏఎస్‌, బీసీ సామాజిక వర్గానికి చెందిన బుర్రా వెంకటేశం వైపు మొగ్గు చూపింది. ఈయన కమిషన్‌కు నాలుగో చైర్మన్‌ అవుతారు. ఇంతకుముందు మొదటి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, రెండో చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ బి.జనార్దన్‌రెడ్డి పని చేశారు. మూడో చైర్మన్‌గా ప్రస్తుతం బి.మహేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన స్థానంలోనే బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. 62 ఏళ్ల నిబంధన ప్రకారం వెంకటేశం ఈ పదవిలో ఐదేళ్లకు పైగానే కొనసాగే అవకాశం ఉంది.


  • సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉమ్మడి ఏపీలో టాపర్‌

జనగామ జిలా ఓబుల్‌ కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం 1995లో ఐఏఎ్‌సగా ఎంపికయ్యారు. అప్పట్లో ఆయన సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో దేశంలోనే 15వ ర్యాంకును సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనే టాపర్‌. గతంలో ఆయన హోంశాఖ కార్యదర్శిగా, 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అంతకుముందు 2005-2009 మధ్యకాలంలో మెదక్‌, గుంటూరు జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. ఇటీవల విద్యాశాఖలో చేపట్టిన 11 వేల మంది కొత్త ఉపాధ్యాయుల ఎంపిక, 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు, 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన సాఫీగా పూర్తి చేశారు.


  • స్పెషల్‌ సీఎస్‌గా చాన్స్‌ కొట్టేసిన వెంకటేశం

వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ముందు స్పెషల్‌ సీఎ్‌సగా చాన్స్‌ కొట్టేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటివరకు ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వెంకటేశాన్ని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రీడిజిగ్నేట్‌ చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఆయనకు స్పెషల్‌ సీఎ్‌స(సూపర్‌ టైమ్‌ స్కేల్‌ కంటే ఎక్కువ) స్థాయి వేతన భత్యాలు లభిస్తాయి.


  • జనగామ బిడ్డకు దక్కిన గౌరవం

జనగామ కల్చరల్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమితులు కానుండడంపై జనగామ జిల్లా వాసుల్లో ఆనందం వ్యక్త మవుతోంది. వెంకటేశం హైదరాబాద్‌ చిక్కడపల్లిలో ని అంబేడ్కర్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పేద కుటుంబంలో జన్మించిన వెంకటేశం చదువులో రాణిస్తూ అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 04:21 AM