26 గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల
ABN, Publish Date - Aug 30 , 2024 | 12:29 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి 3,48,235 క్యూసెక్కుల వరద రాక
నాగార్జునసాగర్, కేతేపల్లి, మేళ్లచెర్వు, దామరచర్ల, ఆగస్టు 29: నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద రాక పెరగడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం 9గంటలకు 24 క్రస్ట్ గేట్ల ద్వారా, 10గంటలకు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,86 ,434 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా(214.3633టీఎంసీలుగా) ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10క్రస్ట్ గేట్లను 10అడుగుల మేరకు ఎత్తి 2,79,830 క్యూసెక్కుల నీటిని, కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,523 క్యూసెక్కుల నీటిని, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 37,882 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు మొత్తం 3,48,235 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 590 అడుగులు (312.0450టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9,382 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8280 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,461 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని, మొత్తం 26 క్రస్ట్ గేట్లల్లో 14 క్రస్ట్ గేట్లను 10అడుగుల మేరకు, 12 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 3,07,382 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొ త్తం 3,55,910 నీరు విడుదలవుతుండగా, ఎగువ నుం చి 3,48,235 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
పులిచింతల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత
తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో 14 గేట్లను ఎత్తి 3,24,393 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 175 అడుగులు(45.77 టీఎంసీలు) కాగా, గురువారం సాయంత్రానికి 171.91అడుగులు (41 టీఎంసీలు)గా నమోదైంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,75,393 క్యూసెక్కులుగా నమోదైంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి నాలుగు యూనిట్ల ద్వారా 16వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 102 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, మొత్తం ప్రాజెక్టు అవుట్‌ప్లో 3,40,393 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కంటే ఔట్‌ఫ్లో అధికంగా నమోదైంది.
నిలకడగా మూసీ నీటిమట్టం
మూసీ ప్రాజెక్టుకు నీటిమట్టం 643.40అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. వారం రోజుల పాటు ఎగువ నుంచి మోస్తరుగా ఉన్న ఇన్‌ఫ్లో రెండు రోజులుగా తగ్గింది. దీంతో మూసీ ప్రాజెక్టు నీటిమట్టంలో హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగా కొనసాగుతోంది. ఎగువ మూసీ పరివాహక ప్రాంతాలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే ఇన్‌ఫ్లో 503క్యూసెక్కులుగా నమోదైంది. 645అడుగుల (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న మూసీ ప్రా జెక్టు ప్రస్తుత నీటిమట్టం 643.40అడుగులు(4.04టీఎంసీ)గా ఉంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి కాల్వకు 239.40క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 263.34 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా మూసీ నుంచి 502.74 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
కొనసాగుతున్న నీటి విడుదల
ఎగువ నాగార్జునసాగర్ నుంచి పెద్దఎత్తున దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో గురువారం అడవిదేవులపల్లి మండలకేంద్రం శివారులోని టెయిల్ పాండ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి టెయిల్ పాండ్‌కు 3,35,843 క్యూసెక్కుల నీరు టెయిల్‌పాండ్‌కు వస్తోం ది. దీంతో టెయిల్ పాండ్‌లోని 16గేట్లను 4మీటర్ల మే రా ఎత్తి 3,31,680 క్యూసెక్కుల నీటిని దిగువ పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - Aug 30 , 2024 | 12:29 AM