తుక్కుగూడలో రియల్ భూమ్!
ABN, Publish Date - Sep 18 , 2024 | 11:22 PM
తుక్కుగూడ మున్సిపాలిటీలో రియల్ జోరు కొనసాగుతోంది. గడిచిన అయిదేళ్లలో ఈ పురపాలిక పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక లేఅవుట్లకు అనుమతులు జారీ కావడం గమనార్హం. భవన నిర్మాణ పర్మిషన్లలో బడంగ్‌పేట పురపాలిక ముందంజలో ఉంది. ఇక్కడ అయిదేళ్లలో భవన నిర్మాణాలకు అధికంగా అనుమతులు జారీ అయ్యాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.
శివారు మున్సిపాలిటీల్లో అగ్రస్థానం
గడిచిన ఐదేళ్లలో అత్యధిక లేఅవుట్లు
ఉమ్మడి జిల్లాలో 67,853 భవన నిర్మాణాలు
అనుమతుల జారీలో బడంగ్‌పేట ముందంజ
తుక్కుగూడ మున్సిపాలిటీలో రియల్ జోరు కొనసాగుతోంది. గడిచిన అయిదేళ్లలో ఈ పురపాలిక పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక లేఅవుట్లకు అనుమతులు జారీ కావడం గమనార్హం. భవన నిర్మాణ పర్మిషన్లలో బడంగ్‌పేట పురపాలిక ముందంజలో ఉంది. ఇక్కడ అయిదేళ్లలో భవన నిర్మాణాలకు అధికంగా అనుమతులు జారీ అయ్యాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా పరిధిలోని 23 పురపాలికల్లో అయిదేళ్లలో 67,853 భవన నిర్మాణాలకు ప్రభుత్వం (హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌శాఖల నుంచి) అనుమతులు జారీ చేసింది. అలాగే 272 లేఅవుట్లకు అనుమతులు ఇచ్చింది. తాజాగా నగర శివార్లలోని 51 గ్రామాలను శివారు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మున్సిపాలిటీలన్నింటినీ కూడా జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ఫ్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల శివార్లలోని మున్సిపాలిటీల ప్రగతి వివరాలను ప్రభుత్వం సేకరించింది. రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఇతర రంగాల్లో అభివృద్ధి, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయి అధికారుల నుంచి తీసుకుంది. ఈ డేటా ఆధారంగా హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ అయిదేళ్లలో శివార్లలో జరిగిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మరింత అభివృద్ధికి కొత్తబాటలు వేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ వివరాల ప్రకారం ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలో ఉన్న తుక్కుగూడ మున్సిపాలిటీ రియల్‌ఎస్టేట్‌లో ముందంజలో ఉంది. ఇక్కడ అత్యధికంగా అయిదేళ్లలో 52 లేఅవుట్లకు అనుమతులు జారీ చేశారు. అలాగే దుండిగల్‌లో 42, ఆదిభట్లలో 30 లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. ఇక భవన నిర్మాణాల్లో బడంగ్‌పేట దూసుకుపోతోంది. ఇక్కడ అత్యధికంగా అయిదేళ్లలో 13637 భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. తరువాత తుర్కయాంజల్‌లో 7457 భవనాలకు, బోడుప్పల్‌లో 7445, పీర్జాదిగూడలో 4381, బండ్లగూడ జాగీర్‌లో 4124భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు.
అక్రమాలు అధికమే...
ఇదిలా ఉంటే అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు కూడా శివారు మున్సిపా లిటీల్లో అధికంగా ఉన్నాయి. పాత పంచాయతీ లేఅవుట్ల పేరుతో ఇప్పటికీ కొందరు వెంచర్లు నిర్మిస్తున్నారు. గతంలో పనిచేసిన సర్పం చ్‌లు, పంచాయతీ కార్య దర్శుల సంతకాలను ఫోర్జరీ చేయడం లేదా దొడ్డిదారిన వారితోనే పాత తేదీల్లో సంతకాలు చేయించి తప్పుడు పత్రాలు సృష్టిసు ్తన్నారు. ఇలా శివార్లలో వేలాది ప్లాట్లు ఉన్నాయి. తెలిసో తెలియకో కొనుగోలు చేసిన మధ్య తరగతి వర్గాలవారు తరువాత అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరణ చేసుకునేం దుకు అవకాశం ఇవ్వడంతో కొందరు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు.
Updated Date - Sep 19 , 2024 | 12:01 AM