ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్ట్‌

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:14 AM

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ రాగవీణ తెలిపారు.

ఎక్సైజ్‌ పోలీసుల అదుపులో గంజాయి విక్రయిస్తున్న యువకులు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 26: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ రాగవీణ తెలిపారు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయ భాస్కర్‌గౌడ్‌ ఆదేశాల మేరకు వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో శుక్రవారం తనిఖీలు చేయగా వికారాబాద్‌లోని గంగారం గ్రామానికి చెందిన సాయికుమార్‌, అరుణ్‌ కుమార్‌లు గంజాయి విక్రయించడాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీరు బీదర్‌ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని విచారణలో వెల్లడైందని చెప్పారు. గంజాయి అమ్మడంతో నిందితులు వాటికి బానిసలు అయ్యారని, వారి వద్ద నుంచి 465 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా టాస్క్‌ఫోర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది శివప్రసాద్‌, విష్ణువర్దన్‌రెడ్డి, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:14 AM

Advertising
Advertising