భర్త వేధింపులు తాళలేక ఉరేసుకొని భార్య ఆత్మహత్య
ABN, Publish Date - May 26 , 2024 | 11:59 PM
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కడ్తాల్‌కు చెందిన కల్పన(22) బాసర ఐఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది.
మొయినాబాద్, మే 26: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కడ్తాల్‌కు చెందిన కల్పన(22) బాసర ఐఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. వారి బంధువు మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ గ్రామానికి చెందిన బి.శ్రీశైలంను 29 అక్టోబరు 2023న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. తరువాత ఇరువర్గాల పెద్దలు మాట్లాడి.. 11 ఫిబ్రవరి 2024న హిందూ సంప్రాదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి హిమాయత్‌నగర్‌లో కాపురం ఉంటున్నారు. అయితే, కొంతకాలంగా కల్పన వేరే వ్యక్తులతో మాట్లాడుతోందని భర్త శ్రీశైలం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. అంతేకాకుండా తనకు అదనపు కట్నం కావాలని, స్విఫ్ట్ కారు కొనివ్వాలని డిమాండ్ చేసేవాడు. ఈ విషయంలో శ్రీశైలం తల్లి స్వరూప, బాబాయి రాజు కూడా తోడయ్యారు. దాంతో వారి వేధింపులు తట్టుకోలేక శనివారం రాత్రి కల్పన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - May 26 , 2024 | 11:59 PM