ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిర్భయంగా ఓటు వేయాలి

ABN, Publish Date - May 12 , 2024 | 12:20 AM

నెల 13న సోమవారం జరిగే పోలింగ్‌లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు విరియోగించుకొని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని చేవెళ్ల ఆర్డీవో సాయిరాం తెలిపారు.

మాట్లాడుతున్న చేవెళ్ల ఆర్డీవో సాయిరాం

చేవెళ్ల/ఆమనగల్లు/మొయినాబాద్‌ మే 11: ఈ నెల 13న సోమవారం జరిగే పోలింగ్‌లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు విరియోగించుకొని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని చేవెళ్ల ఆర్డీవో సాయిరాం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గంలో 2,69,960 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వీరికి 298 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, బీఎల్వోలు ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారన్నారు. హోం వోటింగ్‌లో 312మంది ఓటు హక్కు ను వినియోగించుకున్నారని తెలిపారు. చేవెళ్ల మం డలం గొల్లపల్లి పరిధిలో ఉన్న బండారు శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవరణలో డిస్ర్టిబ్యూషన్‌ సెం టర్‌ను ఏర్పాటు చేశామన్నారు. నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. ఓటర్లు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పోలీసు శాఖ అన్ని రకాల భద్రతాఏర్పాట్లు చేసిందని ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో మాట్లాడారు. ప్రలోభాలు, భయా లకు లొంగకుండా ఓటర్లు ఓటు వే సుకోవాలన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లో 76 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 250 మంది స్థానిక, కేంద్ర పోలీసు బలగాల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ మండ లంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నా రు. 65 పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందికి వసతి, ఆహా రం వంటి వసతులు కల్పిస్తామని తెలిపారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఇబ్రహీంపట్నం: పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి నియోజకవర్గ ఏఆర్వో/ఆర్డీవో కె.అనంతరెడ్డి తెలిపారు. ఆర్డీవో కా ర్యాలయంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,39,341 ఓటర్లు ఉన్నారని, 343 పోలింగ్‌ కేంద్రాలు, 143 లొకేషన్లు ఉన్నాయన్నారు. గురునానక్‌ విద్యా సంస్థలో ఈవీఎంలను భద్రపరిచామని, అక్కడి నుంచే ఈవీఎంలు, ఎన్నిక ల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు పంపిణీ చేస్తామన్నారు. 31 మంది సూపర్‌వైజరీ అధికారులు, 319 మంది బూత్‌ లెవల్‌ అధికారులను నియమించామన్నారు. మొత్తం 1,372మంది పోలింగ్‌ సిబ్బంది వి ధుల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. కాగా ఇప్ప టి వరకు నగదు సహా రూ.4.18కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసట్లు ఏఆర్వో వివరించారు.

Updated Date - May 12 , 2024 | 12:20 AM

Advertising
Advertising