బండవెల్కిచర్లలో ఇద్దరు అదృశ్యం
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:28 PM
బండవెల్కిచర్ల గ్రామంలో ఓ బాలిక, వివాహిత అదృశ్యమయ్యారు. ఏఎ్‌సఐ జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బాలిక(17) ఈనెల 21న బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.
కులకచర్ల, ఆగస్టు 24: బండవెల్కిచర్ల గ్రామంలో ఓ బాలిక, వివాహిత అదృశ్యమయ్యారు. ఏఎ్‌సఐ జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బాలిక(17) ఈనెల 21న బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు బంధువుల దగ్గర ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. శనివారం పీఎ్‌సలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఏఎ్‌సఐ తెలిపారు. బాలిక అదృశ్యంపై ముజాహిద్‌పూర్‌కు చెందిన యువకుడిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అదేవిధంగా బండవెల్కిచర్లకు చెందిన జెట్టురి వెంకటయ్య భార్య లక్ష్మమ్మ(42) ఈ నెల 19న సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎ్‌సఐ జైపాల్‌రెడ్డి తెలిపారు.
Updated Date - Aug 24 , 2024 | 11:28 PM